VKB- వంతెన నిర్మాణపు పనులను పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్.

పత్రిక ప్రకటన, తేది: 14.08.2021

జిల్లాలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అధికారులను ఆదేశించారు.
ఈరోజు ధారూర్ మండలంలోని నాగసమందర్ నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండ నిర్మాణపు పనులును వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మళ్ళీ వర్షాలు రాకముందే ఎక్కువ మంది శ్రామికులను పెట్టుకొని పనులను చేపట్టాలని సంబంధిత ఇంజనీర్, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నాగసముందర్ వంతెన నిర్మాణపు పనులకు ఇప్పటికే 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో DE శ్రీనివాస్, AE శ్రవణ్, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.
===============
DPRO/VKB.

Share This Post