Vkb – వికారాబాద్ జిల్లాలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ vedukalu: ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉప సభాపతి టి. పద్మారావు

పత్రిక ప్రకటన, తేది: 15.08.2021

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఉప సభాపతి టి. పద్మారావు గారు పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ పరేడ్ ను పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యారులచే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 141మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలచే ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, జడ్పీ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మంజుల రమేష్, వికారాబాద్, పరిగి, కొడంగల్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

———————DPRO/VKB

Share This Post