VKB – వికారాబాద్ జిల్లాలో మొదటిసారిగా వరి సాగులో ట్రాన్సప్లాంటేషన్ విధానాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

పత్రిక ప్రకటన, తేది:- 10.08.2021.

జిల్లాలో మొదటిసారిగా తక్కువ ఖర్చుతో వరి సాగులో యంత్రంతో వరి నాటు విధానాన్ని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆవిష్కరించారు.
ఈరోజు ధరూర్ మండలంలోని నాగారం గ్రామంలోని రైతు పొలంలో నూతన పద్దతి ద్వారా వరి నారు మరియు నాటు విధానాన్ని ట్రాన్సప్లాంటేషన్ పరికరం నిర్వహించే విధానాన్ని పరిశీలించి సంతోషం వ్యక్తపరిచారు. ఈ పద్దతి ద్వారా కూలీల అవసరం లేకుండా యంత్రం సహాయంతో తక్కువ విత్తనాలు, తక్కువ ఖర్చుతో వరి సాగు చేయవచ్చని సమయం కూడా అదా అవుతుందని తెలియజేసినారు. మునుముందు ఇట్టి యంత్రాలను SHG మహిళా గ్రూప్ సభ్యులకు NREGS క్రింద బ్యాంక్ రుణాల ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇట్టి యంత్రాలను గ్రామంలోని రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు అని తెలిపారు. ఈ యంత్రం మార్కెట్లో రూ.3.50 లక్షలు ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారుల కృషి ఫలితంగా వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయని కొనియాడారు. అనంతరం అదే రైతు పండించిన పెసర పంటను పరిశీలించారు. రైతులు సేంద్రియ పద్దతిలో పంటలు పండించేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, మండల వ్యవసాయ అధికారిని జ్యోతి, పరిగి ADA వీరప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు.
——————=————————DPRO/VKB.

Share This Post