VKB -వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నిఖిల, ఐఏఎస్.

పత్రిక ప్రకటన,
తేది :- 01-09-2021

వికారాబాద్ జిల్లా :- వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ గా బదిలీపై వచ్చిన నిఖిల గారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పూర్వపు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు నుండి కలెక్టర్ గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా అధికారులతో పరిచయ అనంతరం మాట్లాడుతూ, జిల్లాలో హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారని, హరితహారం నర్సరీలలో ఎంతమంది వాచ్ మాన్లు ఉన్నారు, వారి జాబ్ కార్డు ఐడి లతో సహాయం పూర్తి వివరాలు అందించాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమలైన వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వానలు, బృహత్ పల్లె ప్రకృతి వానలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేసారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అధికారులు స్పందిస్తూ హరితహారంలో లక్ష్యం మేరకు ఇప్పటి వరకు 95 శాంతం మొక్కలు నాటడం జరిగిందన్నారు. జిల్లాలో వైకుంఠదామల నిర్మాణపు పనులు దాదాపు పూర్తి అయందని, వివిధ కారణముల వల్ల మరో ఆరు నిర్మాణపు పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు తెలియజేసినారు. జిల్లాలో గల జాతీయ రహదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులపై గురువారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవో లతో సమీక్షించునున్నట్లు తెలిపారు.
ధరణి భూసమస్యలపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ పనుల పరిష్కారానికి సూచనలు అందజేసినారు. ప్రతిరోజు ధరణి సిబ్బంది ఉదయం 9:30 గంటలకు పనులు ప్రారంభించేందుకు లాగిన్ అవ్వాలని సూచించారు. 15 రోజులలో అన్ని పెండంగ్ పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత 20 నెలలుగా కలెక్టర్ గా నిర్వహించి ఈ జిల్లాకు బదిలీపై రావడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికి అందే విధంగా పని చేయడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ లకు అప్పాజెప్పిన ప్రతి పనిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు అందరు కష్టపడి సమర్థవంతంగా పని చేయాలనీ, పనిలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రెవిన్యూ సమస్యలు అన్ని త్వరలో పరిష్కరిస్తానని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, చంద్రయ్య లతో పాటు అన్ని శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
——————————————
DPRO / Vikarabad.

Share This Post