VKB-విద్యార్థులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండ అన్ని ఏర్పాట్లను పూర్తి చేయలి .. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు .

పత్రిక ప్రకటన, తేది : 30.08.2021

వికారాబాద్ జిల్లా :- పాఠశాలల పునః ప్రారంభహోత్సవంలో భాగంగా చాలా రోజుల తరువాత వచ్చే విద్యార్థులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండ అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను సూచించారు.
సోమవారం బంటారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలను, జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 16 నెలల తరువాత పాఠశాలలు తిరిగి తీర్చుకుంటున్నాయని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ అన్ని చర్యలు చేపట్టాలన్నారు. చేత్త, చెదారం లేకుండా క్లాస్ రూమ్ లను, పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యుత్ సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు పై ఏర్పాట్లు అన్ని సక్రమంగా చేయాలన్నారు. మండలంలో మరో రెండు పాఠశాలలకు మిషన్ భగీరథ నీటి వసతి లేదని తెలుపగా, సంబంధిత అధికారిని రెండు రోజులలో నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. మోడల్ స్కూల్ కు కిచెన్ షెడ్ మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు. మండలంలో మరే పాఠశాలకైనా కిచెన్ షెడ్, మార్గుగుదొడ్లు అవసరమైతే వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మోడల్ స్కూల్లో విరిగిపోయిన టాయిలెట్ తలుపులను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలనీ సూచించారు. రేపటి ప్రభుత్వ సెలవును వినియోగించుకోకుండా మిగిలిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలని కోరారు. పాఠశాలలు తెరుచుకున్న తరువాత విద్యార్థులు సామజిక దూరం, కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ఉపాధ్యాయులను సూచించారు. విద్యార్థులలో ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని కోరారు.
అనంతరం బంటారం ప్రధాన రహదారికి ఇరువైపుల రెండు వరసల్లో హరితహారం క్రింద ఎవెన్యూ ప్లాంటేషన్లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మొత్తం 1500 మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.
స్థానిక ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో పశువులకు నిర్వహిస్తున్న బ్రూసెల్లా వాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. దాదాపు 3000 పశువులకు వాక్సినేషన్ చేస్తున్నట్లు సంబంధించిన డాక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలయ్య, ఎంఇఓ చంద్రప్ప, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సరళ, మిషన్ భగీరథ ఇ ఇ వేణుమాధవ్, అడిషనల్ drdo స్టీవెన్ నీల్, పశు వైద్య శాఖ AD సదానందం, డాక్టర్ కుమారస్వామి సర్పంచ్ లావణ్య, ఎంపీపీ ప్రభాకర్, అధికారులు, ఉపాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
——————————————-
DPRO / Vikarabad.

Share This Post