VKB-విద్యా సంస్థల్లో అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ నిఖిల.

పత్రిక ప్రకటన, తేది: 04.09.2021

వికారాబాద్ జిల్లా:= ఈనెల 1 నుండి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభీంచడం జరిగిందని, రోజురోజుకు విద్యార్థుల హాజరు శాంతం పెరిగే విధంగా విద్యార్థుల తల్లి తండ్రులలో ప్రేరణ కలగించాలని, పాఠశాలల్లో ప్రతి రోజు కోవిడ్ నిబంధనలతో పాటు పారిశుధ్య పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవిలతో కలసి ఎంపీడీఓలు, యంఇఓలతో పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో ప్రతి రోజు తప్పనిసరిగా సోడియం హైపోక్లోరైడ్ తో తరగతి గదులు, బెంచీలు పరిశుభ్రం చేయించాలని డీపీవో, ఎం పి ఓ లను ఆదేశించారు. మరుగుదొడ్లు వద్ద లైజాల్ తో స్ప్రే చేసి శుభ్రం చేయించాలన్నారు. మధ్యాన్న భోజనం సమయంలో తప్పకుండ సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించాలని, ఒకే వద్ద అందరు గుమిగూడకుండ విడివిడిగా భోజనాలు చేయించాలన్నారు. విద్యార్థులు చేతులు కడుక్కోనే స్థలంలో నీరు నిలువకుండ చూడాలని అవసరమైతే ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలన్నారు. భోజన సమయంలో తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కొనే విధంగా హెడమాష్టర్లు చూడాలన్నారు. ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్ వేసుకొనే విధంగా ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ధ వహించాలన్నారు. ఇక నుండి ప్రతిరోజు పాఠశాలలను తనిఖీ చేస్తానని, పై విషయంలో ఏలాంటి లోపం ఉన్న కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా వైద్య శాఖ అధికారి, విద్యా శాఖ అధికారి సహకారంతో అన్ని పాఠశాలలకు ఆశా, అంగన్వాడీలను నియమించడం జరిగితుందన్నారు. గేటు వద్దనే ప్రతి విద్యార్ధికి ఫీవర్ చెక్ పరీక్షలు నిర్భహించాలని, ఎవరైనా విద్యార్ధికి నాలతగా ఉంటే పాఠశాలలో గల ఐసొలేషన్ గదిలో ఉంచి RUSK డాక్టర్ టీమ్ ద్వారా అవసరమైన కోవిడ్ టెస్టులు చేయించాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే అన్ని ప్రథమ చికిత్సలు, మందులు అందించి వాహనములో సురక్షితంగా ఇంటి వద్ద దింపి రావాలన్నారు. జిల్లాలో మొత్తం 27 వాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రైవేట్ వర్కర్లతో సహా వాక్సినేషన్ చేయించాలని సూచంచారు. జిల్లాలో అవసరమైన 47 వేల మాస్కులను జీపీ నిధులతో స్వయం సహాయక గ్రూప్ మహిళలతో చేయించి సోమవారం నాటికి అందించాలని DRDO ను ఆదేశించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు మనపై పూర్తి నమ్మకంతో వారి పిల్లలను పాఠశాలకు పంపడం జరుగుతుందని, ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు తేలేత్తకుండా చూసుకోవాల్సొన అవసరముందన్నారు. మండల స్థాయిలో పనులలో ఇబ్బందులు ఏర్పడకుండా ఎంపీడీఓలు, యంఆర్ఓ లు, ఎంపీవో లు జిల్లా కలెక్టర్ అనుమతితో సెలవుపై వెళ్లేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ కు సూచించారు.

పాఠశాలల్లో మంచి వాతావరణం కొరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ స్కీం కింద నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ కొసం వాచ్ అండ్ వార్డు కు నెలకు ఐదు రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు . ఎక్కువ మొత్తంలో మొక్కలు నటితే ఒకరికి జీవనోపాధి లభిస్తుందని తెలియజేసినారు.
—————-==————————-
DPRO /Vikarabad

Share This Post