VKB-సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల.

వికారాబాద్ జిల్లా :- ఎంపీడీఓలు, ఎంపీవోలు ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించినట్లయితే పనులలో పురోగతి వస్తుందని, ప్రతి రోజు కనీసం నాలుగు గ్రామాలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఎంపీడీఓలను ఆదేశించారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఇప్పటి వరకు చేపట్టిన వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, హరితహారం తదితర కార్యక్రమాల పురోగతిపై సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఏ పి ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని వారం రోజులలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి గ్రీన్ ఫెన్సింగ్ చేయాలన్నారు. అన్ని వైకుంఠ ధమాలకు విద్యుత్, నీటి సదుపాయం కల్పించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి మండలంలో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. అన్ని గ్రామాలలో నేటి నుండి NREGS కార్మికులతో గుంటలు తీసే పనులు చేపట్టి శనివారం రోజు మొక్కలు నాటి లక్ష్యం పూర్తి చేయాలన్నారు. నాటిన మొక్కల పూర్తి వివరాలను ప్రభుత్వ వెబ్ – సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను వంద శాంతం సంరక్షించాలని సూచించారు. గ్రామాలలో గ్రామ కార్యదర్శులు ఇతర సిబ్బంది అందరు చురుకుగా పని చేసేలా ఎంపీడీఓలు వారితో కఠినంగా వ్యవహారించాలని, పని చేయని వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎంపీడీఓల పై కలెక్టర్ చర్యలు తీసుకోవాడం జరుగుతుందని హెచ్చరించారు. ఎంపీడీఓలు, ఎంపీవో లు ప్రతిరోజు కనీసం నాలుగు గ్రామాలను సందర్శించి
పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. వన సేవకులకు సంభందించిన డబ్బులను వెంటనే వంద శాంతం చెల్లెంచాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామల పనులు వేగవంతం చేసేందుకు పంచాయతీ రాజ్ ఎఇ లతో మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పల్లె ప్రకృతి వనాలకు, వైకుంఠ దామాలకు గేట్, ఫెన్సింగ్, బోర్డులు అమర్చాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మినీ పల్లెప్రకృతి వనాలు పనులను వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే వారం నిర్వహించే సమీక్ష సమావేశంలో చూపిన పనులను పూర్తి చేసుకొని రావాలని లేనిచో చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్బంగా హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, DRDO కృష్ణన్, వివిధ మండలాల ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఏ పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post