VKB-సమీకృత కలెక్టర్ కార్యాలయ భావన నిర్మాణపు పనులను పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

పత్రిక ప్రకటన, తేది:- 03.09.2021

వికారాబాద్ జిల్లా :- మిగిలి యున్న చిన్నా చితక పనులతో పాటు సుందరికరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత R&B అధికారులను ఆదేశించారు.
ఈరోజు నిర్మాణంలో ఉన్న నూతన సమీకృత కలెక్టర్ భావన నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయ అంతర్ భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని సూచించారు. దీని నిర్మాణం వల్ల భవనానికి అందం వస్తుందన్నారు . పార్కింగ్ కొసం స్థల నిర్ధారణ చేసి అట్టి స్థలంలో పనులను వేగవంతం చేయాలన్నారు. ఖాళీగా ఉన్న మరో స్థలంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. భావనమునకు ఎదురుగా ఉన్న మరికొంత ఖాళీ స్థలంలో గ్రీనరీ పెంచాలని పెంచాలన్నారు. ఆవరణలో ఉన్న మట్టి దిబ్బలను, తాత్కాలిక నిర్మాణాలను మరియు నిరూపయోగంగా వ్రేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని సూచించారు. భావన రెండవ అంతస్తులో SHG మహిళా గ్రూపు సభ్యులకు కాంటీన్ స్థలం కేటాయించాలని, విజయా డైరీ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, మీటింగ్ హాల్, కలెక్టర్ క్యాంపు కార్యాలయం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్త పరిచారు.

ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, R&B EE లాల్ సింగ్, DE శ్రీధర్ రెడ్డి, AE రవికుమార్, కలెక్టర్ కార్యాలయ AO హరిత తదితరులు పాల్గొన్నారు. DPRO/Vikarabad.

Share This Post