VKB-సిటీ స్కాన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.. జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి

పత్రిక ప్రకటన, తేది: 24.08.2021

వికారాబాద్ జిల్లా :- తాండూర్ జిల్లా ఆసుపత్రికి బోయింగ్ అంతర్జాతీయ కంపెనీ ఉచితంగా సీటీ స్కాన్ యంత్రాన్ని అందించడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బసు పేర్కొన్నారు. మంగళవారం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. 1.50 కోట్ల విలువ గల సిటీ స్కానింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్రెడ్డి , జిల్లా కలెక్టర్ పౌసమి బసు , బోయింగ్ అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధి ప్రవీణ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో పేదల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించేందుకు కృషి చేస్తోంద‌న్నారు. తాండూరులో పేద రోగుల‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బోయింగ్ కంపెనీ ద్వారా సిటి స్కాన్‌ను అందుబాటులోకి తీసుక‌రావ‌డం జ‌రిగింద‌న్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళ్ల‌కుండా జిల్లా ఆసుప‌త్రిలోనే సిటి స్కాన్ సేవ‌ల‌ను పొందాల‌న్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న తాండూరు ప్రాంత వాసుల‌ను దృష్టిలో ఉంచుకుని సిటి స్కాన్ విరాళంగా అందించిన బోయింగ్ కంపెనీ ప్ర‌తినిధుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ఈ కార్య‌క్ర‌మంలో తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి, బోయింగ్ కంపెనీ ప్ర‌తినిధులు ప్రవీణ య‌జ్ఞంబాత్‌, రీతు శ‌ర్మ‌, సౌర‌భ్ త‌నేజా, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ గౌడ్, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, వైస్ చైర్ దీపా న‌ర్సింలు, యాలాల ఎంపీపీ బాలేశ్వ‌ర్ గుప్త‌, ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున ఆసుప‌త్రి సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.
————————–
DPRO / VKB.

Share This Post