VKB – స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం.

పత్రిక ప్రకటన, Dt:- 11.08.2021

వికారాబాద్ జిల్లా :- ఈనెల 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈరోజు కలెక్టర్ ఛాంబర్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సామాన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ దృశ్య ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏలాంటి ఆదేశాలు అందలేదని, అయినప్పటికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున అధికారులు అందరు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ముమ్మర ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా వేడుకలు నిర్వహించాలన్నారు. అధికారులతో పాటు వారి కార్యాలయ సిబ్బంది అందరు తప్పనిసరిగా స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఛాయా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా అధికారులకు ఆదేశించారు.

వచ్చే సోమవారం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావానికి బదులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేసినారు. ప్రజల నుండి వచ్చే వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు అధికారులు అందరు తప్పనిసరిగా ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, చంద్రయ్య లతో పాటు అడిషనల్ ఎస్. పి. రషీద్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
===================DPRO/Vikarabad.

Share This Post