VKB – స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, మరియు జిల్లా SP.నారాయణ

పత్రిక ప్రకటన, తేది: 14.08.2021

ఈనెల 15న పోలీస్ పరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు.
గ్రౌండ్ లో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేయనున్న చేయచిత్ర ప్రదర్శనల స్టాల్స్ ను , మైక్, vip సీటింగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సుందరికరణ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ పారడే రెహర్సల్ ను జిల్లా sp తో కలసి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసారు. ఉత్సవాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ముఖ్య అతిధి బస కొరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అతిథి గృహంలో పారిశుధ్య పనులతో పాటు మొక్కలు నాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా SP నారాయణ, Addl. S. P. రషీద్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, RDO ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

—————————————DPRO/VKB.

Share This Post