VKB – హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన వికారాబాద్ జిల్లా కలెక్టర్

పత్రిక ప్రకటన,తేది:- 13.08.2021
వికారాబాద్ జిల్లా :- హరితహారంలో భాగంగా ఈరోజు మోమిన్ పేట మండలంలోని వేల్చాల్, మోరంగపల్లి గ్రామాలలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మూడు వరుసల్లో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు అందరు ఉత్సాహంగా పాల్గొన్నందున వారితో కలెక్టర్ ముచటించారు. ఈరోజు నాగులాపంచమి పండుగ ఉన్నపటికీ హరితహారంలో పాల్గున్నందుకు వారిని ప్రశంసించారు. ఈ సందర్బంగా నిర్మల అనే ఉపాధి హామీ కూలీ కలెక్టర్ తో మాట్లాడుతూ హరితహారంలో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలుపగా, కలెక్టర్ స్పందిస్తూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. సుభాన్ రెడ్డి అనే కూలీ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం కూడా పండుగతో సమానమని తెలిపాడు. రత్నయ్య అనే కూలీ మాట్లాడుతు రెండు వరుసలలో మామూలు మొక్కలు నాటి మూడవ వరుసలో పండ్ల మొక్కలు నాటినట్లయితే వాటి పండ్లు మూగ జీవాలకు, రోడ్డు మార్గంలో పోయే ప్రజలకు ఉపయోగపడితాయని తెలుపగా, కలెక్టర్ అతని సలహాను స్వీకరించి వెంటనే అమలు చేయాలని DRDO కృష్ణన్ కు సూచించారు. DRDA శాఖకు కేటాయించిన లక్ష్యాలకు మించి మొక్కలు నటితే ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ లాభం చేకూరుతుందని అన్నారు. నాటిన అన్ని మొక్కలను నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో DRDO కృష్ణన్, ఎంపీవో యాదగిరి, APO శంకర్, వేల్చాల్ సర్పంచ్, ఉప. సర్పంచిలు లక్ష్మి, జనార్దన్, గ్రామ కార్యదర్శి నిరంజన్ రెడ్డిలు పాల్గొనగా, మొరంగపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.
=======================
DPRO/VKB.

Share This Post