VKB-SC లబ్ధిదారులకు అవగాహన సదస్సు వికారాబాద్ జిల్లా

పత్రిక ప్రకటన, తేది:-28.08.2021

వికారాబాద్ జిల్లా :- రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక అభివృద్ధి కొసం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ తెలియజేసారు.
ఈరోజు స్థానిక అంబేద్కర్ భావనంలో ఎస్సి కార్పొరేషన్ ద్వారా 169 మంది ఎస్సి లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీపై రూ.50 వేల చొప్పున చిరు వ్యాపారం కొరకు ఎంపికైన అభ్యర్థుల వ్యాపార అభివృద్ధికై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ బి. ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఎస్సి ల అభివృద్ధి కొరకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం క్రింద 26 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని, స్వంత వ్యాపారం చేసుకోడానికి 10 లక్షల రూపాయలు 60 శాంతం సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. ఎస్సి కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్యం కల్పించి వివిధ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడుతుందని, 10వ తరగతి నుండి ఐటిఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ వరకు పూర్తి ఉచితంగా శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. ఇట్టి కాలంలో ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్సి కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని సామజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్ ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సరియైన చిరు వ్యాపారం ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇడి ఎస్సి కార్పొరేషన్ బాబు మొజెస్, DSCDO మల్లేశం, ఫైనాన్స్ మేనేజర్ రవి కుమార్, మెప్మా అధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. DPRO/VKB.

Share This Post