zp general body meeting press note

. మంగళవారం కొత్తగూడెం క్లబ్బు నందు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, గిరిజనాభివృద్ధి, ఇంటర్మీడియట్ విద్య, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య, అటవీశాఖ, మైన్స్ అండ్ జియాలజి, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖపై చర్చ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. గ్రామాలు, మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు జడ్పిలో నిర్వహించు స్టాండింగ్ కమిటి, సర్వసభ్య సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని, ఏదేని అత్యవసర పరిస్థితుల్లో హాజరుకాలేకపోయినట్లుయితే ముందస్తు సమాచారాన్ని లిఖిత పూర్వకంగా జడ్పీ కార్యాలయానికి తెలియ చేయాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్త పర్యటనలు నిర్వహించి సమస్యలు క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పాఠశాలలో ఉన్న  చిన్ని చిన్న మరమ్మత్తులు నిర్వహణకు జాప్యం చేయక తక్షణం కలెక్టర్ దృష్టికి తెచ్చి పరిష్కరించాలని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు దాతలు సిద్ధంగా ఉన్నారని వారి యొక్క సహాకారాన్ని తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆయన అభినందించారు. సమస్యలు పరిష్కారానికి పరస్పర చర్చలు జరిగినప్పుడే లోపాలను అధిగమించి అభివృద్ధిలో పురోగమించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం మమేకమై పనిచేస్తూ. జిల్లాను అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నారని చెప్పారు. చర్చలు జరగాలని, చర్చలు ద్వారానే సమస్యలు. పరిష్కారమవుతాయని చెప్పారు. అభివృద్ధిలో వెనుకబడిన నిర్వీర్యమైన జిల్లా రాష్ట్ర ఏర్పాటు తదుపరి నేడు అభివృద్ధిలో అగ్రగామిగా పయనిస్తున్నదని చెప్పారు. అందరం కలిసిమెలసి పనిచేసి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. మన జిల్లాకు చెందిన పాఠశాలలు, కళాశాలలు ఖమ్మం జిల్లాలో నిర్వహించడం వల్ల ఇక్కడి విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతున్నదని, ప్రభుత్వం కూడా ఆయా నియోజకవర్గాల్లోనే పాఠశాలలు, కళాశాలలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున మార్చుటకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భద్రాచలంలో ఇసుకర్యాంపు ఏర్పాటులో ఎందుకు జాప్యం జరుగుతున్నదని మైనింగ్, టిఎస్ ఎండిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సొసైటీ ఏర్పాటు కూడా కాలేదని గ్రహించిన ఆయన సొసైటీ ఏర్పాటులో ఎందుకు జాప్యం జరుగుతున్నదని డిసిఓను ప్రశ్నించగా, రెండు నెలల నుండి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పిన సమాధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిబంధనలు ప్రకారం పని చేయాలని, ఈ విషయంలో కలెక్టర్ పర్యవేక్షణ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.  స్థాయి సంఘ, సర్వసభ్య సమావేశాలకు అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, సభను తప్పుదోవ పట్టించే విధంగా చేయొద్దని హితవుపలికారు. ప్రజా ప్రతినిధులు తలెత్తిన సమస్యలను అధికారులు పరిష్కరించడానికి కృషి చేయాలని, సమాధానం సంతృప్తి పరచే విధంగా ఉండాలని చెప్పారు. ఆర్ధిక వనరులతో ముడిపడిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చి పరిష్కరించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మనందరం ఒక యూనిట్ గా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రతలో మన జిల్లా నెంబర్ వన్ గా ఉందని, మన జిల్లాలోకి ప్రవేశించగానే భద్రాద్రి జిల్లా అనే విధంగా ఉన్నదని ఇందుకు మీ అందరి కృషి, పట్టుదల ఎంతో ఉందని అభినందించారు. గిరిజన ప్రాంతమైన అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి సోపానాలని, అభివృద్ధి మార్పుకు మనందరం కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తుల అంతిమ కార్య క్రమాలు వైకుంఠదామాల్లోనే నిర్వహించాలని, నిర్వహించుటకు గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో సర్వీసు చార్జీలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీపీఓ  సూచించారు. గ్రామ పంచాయతీలు ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం కానీ సర్వీసు చార్జీలు ఎందుకు తీసుకోలేకపోతున్నామని సర్వీసు చార్జీలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు సరిపోవడం లేదని నిధులు పెంచు విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సూచించారు. పాఠశాలల అవసరాలు తీర్చుటకు జడ్బీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలు కల్పనకు చర్ల మండలంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. చర్లలో 108 వాహనం అందుబాటులో లేనందున ప్రత్యామ్నయ వాహనం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. చర్లలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నియోజకవర్గాలకు మంజూరు చేసిన పాఠశాలలు అదే నియోజకవర్గంలో నిర్వహించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లకు మరమ్మత్తులు నిర్వహించి వినియోగంలోకి తేవాలని చెప్పారు. పాఠశాలలు తనిఖీలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా వెంట తీసుకెళ్లాలని, అపుడే సమస్య సులువుగా పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. 42 బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశామని, మరుగుదొడ్లు లేని పాఠశాలల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలకు మిషన్ బగీరథ మంచినీరు సరఫరా చేయాలని, మంచినీరు సరఫరా కానీ పాఠశాలల వివరాలు స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మంచినీరు సరఫరాపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ తీసుకోవాలని డిఈఓను ఆదేశించారు. వ్యాక్సినేషన్, | ప్రక్రియలో గ్రామస్థాయి నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిర్వహించు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. ఈ సర్వసభ్య సమావేశంలో భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సిఈఓ విద్యాలత, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్రావు, అన్ని మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, కో ఆప్షన్ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post